Anumana Pakshi : DJ టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ ‘అనుమాన పక్షి’ ఫిబ్రవరిలో రిలీజ్.. వీడియో వైరల్

Anumanapakshi
Anumana Pakshi : ‘అనుమాన పక్షి’ తో మరో హిలేరియస్ ఎంటర్టైనర్‌కు సిద్ధమయ్యారు దర్శకుడు విమల్ కృష్ణ. ‘డిజె టిల్లు’తో బ్లాక్‌బస్టర్ డెబ్యూ చేసిన ఆయన, ఇప్పుడు యంగ్ ట్యాలెంటెడ్ రాగ్ మయూర్‌ను హీరోగా పరిచయం చేస్తూ చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పటికే రిలీజైన టైటిల్ మరియు ఫస్ట్-లుక్ పోస్టర్ మంచి ఆసక్తి రేకెత్తించాయి.

తాజాగా మేకర్స్, రాగ్ మయూర్ పాత్ర ద్వారా సినిమా రిలీజ్ సమయాన్ని సూచించే ఒక ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆయనను ‘అనుమాన పక్షి’గా పరిచయం చేసారు. చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, అప్రమత్తంగా ఉండే స్వభావం వల్ల తన చుట్టుపక్కల వారికి గందరగోళం సృష్టించే ఈ విభిన్నమైన క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు త్వరలోనే ఫస్ట్ సింగిల్ రాబోతుందని కూడా తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.