Gatha Vaibhavam : ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లిన ‘గత వైభవం’ ట్రైలర్‌

Gatha vaibhavam
Gatha Vaibhavam : ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా ‘గత వైభవం’ ట్రైలర్‌ విడుదలైంది. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్‌పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు.

Also Read :  Vijay Deverakonda: రౌడీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ‘రాణాబాలి’ క్రేజీ అప్‌డేట్!

నేడు విడుదలైన ట్రైలర్‌ నాలుగు విభిన్న కాలాలను అద్భుతంగా చూపించింది. పోర్చుగీస్ కాలం, దేవలోకం, రాజుల యుగం, ఆధునిక యుగం. ప్రతి యుగంలోనూ హీరో-హీరోయిన్ల ప్రేమ కథ ఎలా పునర్జన్మలతో కొనసాగుతుందో, వారు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటో ఆకట్టుకునేలా చూపించారు. దర్శకుడు సుని యొక్క అంబీషస్ విజన్‌, ఆర్ట్ డైరెక్టర్ల సృజనాత్మకత, విలియం జె. డేవిడ్ సినిమాటోగ్రఫీ, జూదా సాండీ సంగీతం కలిసి ఈ సినిమాకి అద్భుతమైన సినిమాటిక్ ఫీల్ ఇచ్చాయి.

Also Read :  Abhisun Jeevinth: డైరెక్టర్‌గా హిట్టు.. హీరోగా సక్సెస్ .. ఇప్పుడు 'డ్రామా కంపెనీ'తో హ్యాట్రిక్‌పై కన్నేసిన అభిషన్ జీవింత్!

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ తమ పాత్రల్లో పూర్తిగా ఒదిగి, ప్రతి యుగానికి తగ్గ లుక్‌, కెమిస్ట్రీతో మెప్పించారు. అద్భుతమైన VFX, విజువల్ గ్రాండియర్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ ఫాంటసీ అనుభూతిని ఇవ్వబోతోందని ట్రైలర్ సూచిస్తోంది. మొత్తం మీద ‘గత వైభవం’ ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.