Heroines Clash : రష్మిక, అనుష్క సినిమాలు ఒకే రోజునా..?

Anushka rashmika

Heroines Clash : ఘాటీ సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం జులైకి వాయిదా పడింది. కానీ జులై కూడా ముగియబోతున్నా ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. అందుకే ఇకపై ఖచ్చితంగా నిర్ణయించిన తేదీని మాత్రమే ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు ఘాటీ టీం భావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయాలని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఘాటీ టీం కూడా ఈ డేట్‌పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న రష్మిక మంధాన, తన లేటెస్ట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ **”ద గర్ల్‌ఫ్రెండ్”**తో సెప్టెంబర్ 5న బరిలోకి దిగాలనుకుంటోందట. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను కూడా అదే రోజున విడుదల చేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఎందుకంటే, సెప్టెంబర్ 25న ఓజీ, అఖండ 2, చిరు విశ్వంభర లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయని టాక్ ఉంది. ఈ బిగ్ మూవీస్‌కి దూరంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ముందుగానే మూడు వారాల గ్యాప్ పెట్టుకోవాలని మేకర్స్ భావిస్తున్నారని బజ్.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

సెప్టెంబర్ 5న ఘాటీ, ద గర్ల్‌ఫ్రెండ్ రెండూ రిలీజ్ అయితే, యంగ్ హీరో తేజా సజ్జా మిరాయ్‌తో పోటీ తప్పదనేది లేటెస్ట్ టాక్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన మిరాయ్ కూడా సెప్టెంబర్ 5న రానుంది. అంతేకాదు, మదరాసి మూవీ కూడా అదే రోజున విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. అయితే మిరాయ్ మళ్లీ డిలే అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5 డేట్ కోసం అనుష్క, రష్మిక మేకర్స్ పోటీ పడుతున్నారని ఇండస్ట్రీలో టాక్. రాజాసాబ్ డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, UV క్రియేషన్స్ కూడా ఇదే తేదీపై చర్చిస్తున్నాయని చెబుతున్నారు. ఇక భామలు ఒక్క రోజునే రానున్నారా, లేక వేరే డేట్ ఫిక్స్ చేసుకుంటారా అన్నది త్వరలోనే తెలిసిపోనుంది.