
Hansika Motwani : సినీ పరిశ్రమలో స్టార్ సెలబ్రెటీ జంటల విడాకుల పుకార్లు ఆగడం లేదు. గత ఏడాది నుంచి ఐశ్వర్య రాయ్–అభిషేక్ బచ్చన్ జంట విడిపోతున్నారని వచ్చిన రూమర్స్‌ను వారు తిప్పికొట్టారు. ఇటీవల నయనతార–విఘ్నేష్ శివన్ జంట గురించి వచ్చిన పుకార్లను కూడా నయన్ తన కుటుంబంతో కలిసి దేవాలయంలో దర్శనం చేసి ఖండించారు. తాజాగా ఈ జాబితాలో హీరోయిన్ హన్సిక మోత్వానీ పేరు కూడా చేరింది. 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన హన్సిక, ‘దేశముదురు’, ‘కందిరీగ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో టాలీవుడ్‌ను షేక్ చేసింది.
తెల్లని చర్మం, ముద్దుగా ఉండే వ్యక్తిత్వంతో కుర్రకారును కట్టిపడేసింది. నితిన్, రామ్, గోపీచంద్, విజయ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసింది. కానీ వరుస ఫ్లాప్ సినిమాల కారణంగా ఆమె కెరీర్ ఒక్కసారిగా క్షీణించింది. అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చిన హన్సిక ఒక దశలో టెలివిజన్ షోలలో జడ్జ్‌గా పనిచేయాల్సి వచ్చింది. అయినప్పటికీ తట్టుకుని మళ్లీ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం తమిళంలో ‘రౌడీ బేబీ’, ‘మ్యాన్’, ‘గాంధారి’ సినిమాలతో పాటు హిందీలో ‘లవ్ ఎఫైర్’ సినిమాలో నటిస్తోంది.
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే హన్సిక, తమిళ హీరో శింబుతో ప్రేమలో మునిగితేలింది. వారి సంబంధం మీడియా హెడ్లైన్స్‌లో నిలిచింది. పెళ్లి అవుతుందని అనుకున్న సమయంలో వీరిద్దరూ విడిపోవడం పెద్ద షాక్ ఇచ్చింది. తర్వాత హన్సిక తన కెరీర్‌పై దృష్టి పెట్టి వ్యాపారవేత్త సొహైల్ కతూరియాతో డేటింగ్ మొదలుపెట్టి 2022 డిసెంబర్ 22న గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత హనీమూన్, వెకేషన్లతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరించింది. అయితే సొహైల్‌కు హన్సికతో పెళ్లి కానప్పటికీ గతంలో వివాహం జరిగిందని, హన్సికే కారణమని అప్పట్లో పుకార్లు వచ్చాయి. అయితే వాటిని హన్సిక బలంగా ఖండించి, తనకు వాటితో సంబంధం లేదని స్పష్టంచేసింది.
తాజాగా హన్సిక–సొహైల్ జంట మధ్య విభేదాలు తలెత్తినట్లు బీటౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్లయిన కొద్దికాలంలోనే సొహైల్ కుటుంబంలో హన్సికకు ఇబ్బందులు తలెత్తడంతో తరచుగా వారి మధ్య గొడవలు జరిగి, చివరికి హన్సిక తన తల్లి వద్దకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో భర్తతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ షేర్ చేసిన హన్సిక, ఇప్పుడు తల్లితో కలిసి వీడియోలు చేస్తుండటంతో ఈ వార్తలు మరింత బలపడుతున్నాయి. వీరిద్దరూ నిజంగా విడాకులు తీసుకుంటారా? లేక ఇది కేవలం రూమర్స్ మాత్రమేనా? అన్నది తెలుసుకోవాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.












