
Bad Boy Karthik : హీరో నాగ శౌర్య నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన దర్శకుడు రామ్ దేశీనా (రమేశ్) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు హిట్ అవగా, టీజర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ రోజు ఈ సినిమా నుంచి భావోద్వేగభరితమైన ‘పొమ్మంటే’ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్.
హారిస్ జయరాజ్ స్వరపరిచిన ఈ పాట మెలోడీతో పాటు విడిపోవడం వల్ల కలిగే బాధను, అన్న–చెల్లెళ్ల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపిస్తోంది. చంద్రబోస్ రాసిన లిరిక్స్ లోతైన భావాలను వ్యక్తపరుస్తాయి. విజయ్ యేసుదాస్, శక్తిశ్రీ గోపాలన్ గాత్రాలు ఈ పాటకు మరింత భావోద్వేగాన్ని తెచ్చాయి. ఈ పాటలో నాగ శౌర్య, శ్రీదేవి విజయ్‌కుమార్ అన్నా–చెల్లెళ్లుగా కనిపిస్తారు. అపార్థాల వల్ల దూరమైనా, ప్రేమతో కలిసిపోయే వారి బంధాన్ని సింపుల్‌గా, హృదయాన్ని కదిలించేలా చూపించారు. అజయ్ పాత్ర కూడా ఈ ఎమోషన్ ను ఇంకా పెంచుతుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని రసూల్ ఎల్లోర్, ఎడిటింగ్‌ను కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్షన్‌ను రామాంజనేయులు నిర్వహిస్తున్నారు.












