
Isha Glimpse : హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, బబ్లూ పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు శ్రీనివాస్ మన్నే రూపొందిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. పోతుల హెమ వెంకటేశ్వరరావు హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 12, 2025న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఒక భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. స్కూల్ పిల్లలు దెయ్యాల కథలు చెప్పుకునే సీన్లతో మొదలై, వెంటనే భయపెట్టే విజువల్స్, టెన్షన్ పెంచే సౌండ్ డిజైన్‌తో సస్పెన్స్‌ని పెంచుతుంది. పాడుబడ్డ ఇంటి చుట్టూ తిరిగే రహస్యాలు, పాత్రలు ఎదుర్కొనే భయపడే పరిస్థితులు ఇందులో కనిపిస్తాయి. హారర్ ప్రేమికులకు ఈ సినిమా ఒక పండగనే చెప్పొచ్చు. ఆర్.ఆర్. ధ్రువన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, సంతోష్ సనమోని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి చిత్రాలకు నిర్మాతలుగా వ్యవహరించిన బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఈ జంట ‘ఈషా’ సినిమాపై కూడా మంచి నమ్మకంతో ఉన్నారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
When fear knocks… you answer. 💀
Dive into the chilling #Isha Glimpse that sets the tone for the storm ahead ❤️🔥
Experience the terror unfold on DECEMBER 12th, 2025 💥#IshaOnDec12th pic.twitter.com/zH10ceA64f
— Vamsi Nandipati (@connect2vamsi) December 4, 2025










