Hreem : ‘హ్రీం’ మూవీ లాంచ్ – సందీప్‌ కిషన్‌ క్లాప్‌తో గ్రాండ్ ప్రారంభం!

Hreem
Hreem : పవన్ తాత, చమిందా వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం ‘హ్రీం’ ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి రాజేశ్ రావూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శివమ్ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పణలో శివ మల్లాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రారంభోత్సవానికి హీరో సందీప్ కిషన్ క్లాప్ ఇవ్వగా, నటులు అలీ, బెనర్జీ, ఆడిటర్ విజయేంద్ర రెడ్డి, సినిజోష్ అధినేత రాంబాబు పర్వతనేని.. దర్శకుడు రాజేశ్‌కు స్క్రిప్ట్ అందించారు. కెమెరా స్విచాన్‌ను నటుడు రాజీవ్ కనకాల చేశారు.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

Hreem1

ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ, “నా తొలి సినిమా నుంచే శివ మల్లాల గారితో పరిచయం ఉంది. మంచి మిత్రుడే కాదు, మీడియా రంగంలో నాకెంతో సహకారం చేసిన వ్యక్తి. ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ, “ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నాను. హీరోయిన్ చమిందా వర్మ తెలుగమ్మాయి, ఆమె డాక్టర్ కూడా. దర్శకుడు రాజేశ్, పవన్ తాత ఇద్దరూ మంచి టాలెంట్ ఉన్నవారు. శివ మల్లాలగారు నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు జనార్థన మహర్షి, నిర్మాత కె. బాబురెడ్డి, తమిళ నిర్మాత సతీష్ కుమార్, ‘ట్రెండింగ్‌లవ్‌’ దర్శకుడు హరీష్‌ నాగరాజ్, ‘బహిష్కరణ’ చిత్ర దర్శకుడు ముకేష్‌ ప్రజాపతి, ఇన్‌ఫ్లుయెన్సర్లు బెజవాడ బేబక్క, వనిత, శ్రీవాణి త్రిపురనేని తదితరులు పాల్గొన్నారు.