Rajinikanth : ‘కూలీ’ రిలీజ్ ముందు రజినీకాంత్‌కు హృతిక్ రోషన్ శుభాకాంక్షలు!!

Rajinikanth
Rajinikanth : ‘వార్ 2’ మరియు ‘కూలీ’ విడుదలకు ముందు రోజు, హృతిక్ రోషన్ X లో రజనీకాంత్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. “మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. మీరు నా మొదటి గురువులలో ఒకరు, రజినీకాంత్ సార్, మీరు నాకు ఎప్పుడూ ఆదర్శం అవ్వాలి, 50 సంవత్సరాల ఆన్-స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు అభినందనలు!” అని X లో పోస్ట్ చేశారు.

1986లో రజినీకాంత్, శ్రీదేవి జంటగా వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘భగవాన్ దాదా’లో, రజినీకాంత్ తో కలిసి బాల నటుడిగా తెర పంచుకున్న విషయాన్ని హృతిక్ గుర్తుచేసుకున్నాడు. భారతీయ సినీ పరిశ్రమలో రజనీకాంత్‌ 50 ఏళ్ల సేవకు గౌరవం తెలుపుతూ, ఆయన వారసత్వం మరియు తెరపై చూపిన మాయాజాలాన్ని హృతిక్ ప్రశంసించారు. అయితే వార్ 2 & కూలీ విడుదలకు ముందు, హృతిక్ రోషన్ తనకు ఆదర్శంగా నిలిచిన రజినీకాంత్ కు బెస్ట్ విషెస్ తెలుపడం విశేషం.