Jai Hanuman : పవిత్ర అంజనాద్రిలో ‘జై హనుమాన్’ కు శ్రీకారం.. హనుమంతుడిగా రిషబ్ శెట్టి!

Jai hanuman
Jai Hanuman : జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ రూపుదిద్దుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పవిత్ర క్షేత్రమైన అంజనాద్రి బెట్టలో ఘనంగా ప్రారంభించారు. ఇది హంపి లోని విజయనగర ప్రాంతంలో ఉంది. హనుమంతుడి జన్మస్థలంగా భావించే ఈ పవిత్ర ప్రదేశంలో సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్‌ను ప్రారంభించారు.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరుకాగా, తొలి షాట్‌ను తేజ సజ్జా డైరెక్ట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి నటించనుండటం సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. కలియుగ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎపిక్‌కు MM కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని ఎస్. తిరునావుక్కరసు నిర్వహిస్తున్నారు. మొత్తానికి భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ మరో విశేషమైన విజువల్ అనుభూతిని అందించనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...