
టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘జిగ్రీస్’. డెబ్యూ డైరెక్టర్ హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో, మౌంట్ మేరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మించిన ఈ చిత్రం 2025 నవంబర్ 14న థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. రోడ్ ట్రిప్–ఫ్రెండ్‌షిప్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది. సినిమా చూస్తున్నంతసేపు తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని ప్రేక్షకులు చెప్పడంతో, తొలి సినిమాతోనే దర్శకుడు హరీశ్ రెడ్డి తన సత్తా చాటినట్లు అయింది.
థియేటర్లలో నవ్వులు పూయించిన యూత్‌ఫుల్ కామెడీ ‘జిగ్రీస్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. జనవరి 6 నుంచి సన్ నెక్ట్స్‌లో, తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో పెద్ద సంఖ్యలో సినిమాను వీక్షించడంతో ఇది మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. సోషల్ మీడియాలో సినిమా క్లిప్స్, డైలాగ్స్ వైరల్ అవుతుండగా, “ఇదే కదా ఫ్రెండ్షిప్ మూవీ” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడా వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా రూపొందిన ఈ సినిమాను కుటుంబంతో కలిసి హాయిగా ఎంజాయ్ చేయొచ్చని ప్రేక్షకులు చెబుతున్నారు.









