Pooja Hegde: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’లో పూజా హెగ్డే? ఆ వార్తల్లో నిజం ఇదే!

Pawan Kalyan

Pooja Hegde: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG 2’. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ‘ఓజీ యూనివర్స్’ (OG Universe)లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒక కీలక పాత్రలో నటించబోతోందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. పవన్ కళ్యాణ్ సరసన ఆమె జోడీ కట్టబోతోందనే వార్తలతో మెగా అభిమానులు కూడా కాస్త ఖుషీ అయ్యారు.

Also Read :  Maa Inti Bangaram: హిస్టరీ క్రియేట్ చేసిన ‘మా ఇంటి బంగారం’.. 16 ఏళ్ల ‘అరుంధతి’ రికార్డ్ బ్రేక్!

కానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజా సమాచారం. పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతోందంటూ వస్తున్న రూమర్స్ అన్నీ పూర్తిగా అవాస్తవం అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఓజీ 2 చిత్ర బృందం ఆమెను సంప్రదించలేదని, అసలు అలాంటి చర్చలేవీ జరగలేదని స్పష్టమైంది. ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని తేలిపోయింది. ప్రస్తుతానికి ‘ఓజీ 2’ టీమ్ స్క్రీప్ట్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే పూర్తి దృష్టి పెట్టిందట. కాబట్టి, పవన్ కళ్యాణ్-పూజా హెగ్డే కాంబో గురించి వస్తున్న వైరల్ పోస్టులను నమ్మవద్దని, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.