Maa Inti Bangaram: హిస్టరీ క్రియేట్ చేసిన ‘మా ఇంటి బంగారం’.. 16 ఏళ్ల ‘అరుంధతి’ రికార్డ్ బ్రేక్!

Box office

Maa Inti Bangaram: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సమంత రూత్ ప్రభు నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో దాదాపు 16 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ‘అరుంధతి’ రికార్డును తాజా మా ఇంటి బంగారం చిత్రంతో సమంత బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 9 రోజుల్లోనే రూ.71.57 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, టాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన ‘సోలో ఫీమేల్ సెంట్రిక్’ చిత్రంగా ఈ సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పింది.

Also Read :  Ravi Teja: దిల్ రాజు బ్యానర్‌లో రవితేజ-శ్రీవిష్ణు సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్ అయిందా?

2009లో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన ‘అరుంధతి’ చిత్రం సాధించిన లైఫ్‌టైమ్ కలెక్షన్ల మార్కును సమంత తన సినిమాతో అధిగమించి నయా చరిత్రను లిఖించింది. బి.వి.నందిని రెడ్డి డైరెక్షన్‌లో యాక్షన్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి ప్రేక్షకులు సంచలన విజయాన్ని అందించారు. రెండో వారంలోనూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బలమైన పట్టును ప్రదర్శిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఎలాంటి కమర్షియల్ మాస్ హీరో సపోర్ట్ లేకుండా, కేవలం కంటెంట్, సమంత వన్-వుమెన్ షోతో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని వండర్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.