Producer Razesh Danda : ఈ దీపావళికి ‘K’ RAMP ర్యాంప్ ర్యాంప్ ఆడిస్తుంది

K rampకిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న చిత్రం’K’ RAMP. హాస్య మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ పై నిర్మించారు రాజేష్ దండా. దీపావళి కానుకగా ఈ నెల 18న థియేటర్స లో విడుదలకు రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ కామెడీతో సూపర్ పంచ్ లతో ఆకట్టుకుంది ‘K’ RAMP.

నిన్న హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో జరిగిన ఈ సినిమాట్రైలర్ లాంచ్ లో రాజేష్ దండా మాట్లాడుతూ ‘ ‘K’ RAMP ట్రైలర్ లాంచింగ్ కు వచ్చిన కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ కు థాంక్స్. 300మంది మాత్రమే సరిపడే ఈ వేడుకకు మూడు వేల మంది రావడంతో షాక్ అయ్యాను. మా సినిమా యూత్ లో ఎంత ఉందొ ఇప్పుడు అర్ధం అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా చేస్తా. ఇక మా సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. దర్శకుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్. నేను బాలయ్య ఫ్యాన్. నా హీరోస్టైల్ లో తొడకొట్టి చెప్తున్న ఈ దీపావళికి వస్తున్న నాలుగు సినిమాలు ఆడాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన హీరో,  తెలుగు సినిమా హీరోని మరో మెట్టు పైన ఉంచాలి. ఈ దీపావళికి ‘K’ RAMP సినిమాను ఆడియెన్స్ అందరు ర్యాంప్ ర్యాంప్ ఆడించాలని కోరుకుంటున్న’ అని అన్నారు. రాజేష్ దండా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతన్నాయి.