Nag Ashwin: ‘విశ్వంభర’ కోసం రంగంలోకి ‘కల్కి’ డైరెక్టర్.. అందుకేనా?

Nag Ashwin

Nag Ashwin: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఫిల్మ్‌నగర్‌లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ (VFX) పనులను మరింత మెరుగుపరిచేందుకు ‘కల్కి 2898 AD’ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను రంగంలోకి దించినట్లు సమాచారం. ‘కల్కి’ సినిమాతో విజువల్ వండర్ క్రియేట్ చేసిన నాగ్ అశ్విన్ అనుభవం ‘విశ్వంభర’కు ఎంతగానో ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట.

Also Read :  Samantha: యూఎస్ఏ గడ్డపై ‘మా ఇంటి బంగారం’తో సరికొత్త చరిత్ర సృష్టించిన సామ్!

అయితే నాగ్ అశ్విన్ ఈ చిత్రంలో కేవలం వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్‌గా లేదా టెక్నికల్ గైడ్‌గా మాత్రమే వ్యవహరిస్తున్నారని టాక్. సినిమా కథ, కథనాల్లో ఆయన ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని, కేవలం గ్రాఫిక్స్ అవుట్‌పుట్ పర్ఫెక్ట్‌గా వచ్చేలా తన వంతు హెల్ప్ అందిస్తున్నారని సమాచారం. మరోవైపు ఈ మూవీ వీఎఫ్ఎక్స్ పనులను శరవేగంగా పూర్తి చేసి, ఎలాగైనా రాబోయే దసరా పండుగకు సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టి ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, నాగ్ అశ్విన్ ప్రస్తుతం ‘కల్కి 2’ పనులతో బిజీగా ఉన్నారు. విశ్వంభర పనులను ఈ సినిమా వర్క్‌ను సమాంతరంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్స్ కోసం మెగా – రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.