Kannappa : తెలుగు సినిమాకి అరుదైన గౌరవం.. రాష్ట్రపతి భవన్‌లో ‘కన్నప్ప’ ప్రత్యేక ప్రదర్శన!

Kannappa
Kannappa : విష్ణు మంచు ప్రధాన పాత్రలో, డా. మోహన్ బాబు నిర్మించిన చారిత్రక భక్తిరస చిత్రం ‘కన్నప్ప’ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ చిత్రాన్ని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరై, కన్నప్పలోని ఆధ్యాత్మికత, శివభక్తి, భావోద్వేగాలు, విజువల్స్‌ను హృదయపూర్వకంగా మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం.. “మాటల్లో చెప్పలేని గౌరవం! భక్తితో నిండిన కథనానికి, మన సంస్కృతికి లభించిన గొప్ప గుర్తింపు ఇది. హర్ హర్ మహాదేవ్, హర్ ఘర్ మహాదేవ్” అంటూ ట్విట్టర్ లో స్పందించింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

ఈ చిత్రంలో విష్ణు మంచు నటనపై విమర్శకుల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. అతని స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రలోని నిబద్ధత ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించబడిన ఈ చిత్రం, తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచే గొప్ప ఘట్టంగా నిలిచింది. భక్తి, వారసత్వం, సినిమాటిక్ అద్భుతతకు ప్రతీకగా నిలిచిన ‘కన్నప్ప’ కు ఇది ఒక జాతీయ గుర్తింపుగా మారింది.