Nagabandham : మహా శివరాత్రికి ‘నాగబంధం’ టీజర్.. మహేష్ బాబు ఎంట్రీతో అంచనాలు రెట్టింపు

Nagabandham
Nagabandham : అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న భారీ మిథాలజికల్ యాక్షన్ చిత్రం ‘నాగబంధం’ విడుదలకు ముందు నుంచే మంచి హైప్‌ను సొంతం చేసుకుంటోంది. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు. దీంతో ప్రాజెక్ట్‌పై ఒక్కసారిగా మరింత హైప్ పెరిగింది. 1750 కాలాన్ని నేపథ్యంగా తీసుకుని, నాగబంధం అనే ప్రాచీన రహస్యాన్ని ఆవిష్కరించే కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఈ చిత్రంలో అఫ్గాన్ పాలకుడు అబ్దాలి పాత్రలో రిషబ్ సావ్నే కనిపించనుండగా, నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. జగపతి బాబు, మురళి శర్మ, జయప్రకాశ్, బి.ఎస్. అవినాష్ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ సెట్స్, అద్భుతమైన విజువల్స్‌తో సాంకేతికంగా కూడా ఈ సినిమా గ్రాండ్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్న ఈ చిత్రం సమ్మర్‌లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.