varanasi: క్రేజీ అప్‌డేట్.. వారణాసిలో రాముడిగా, శివుడిగా మహేష్ బాబు.!

Varanasi

varanasi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం SSMB29. ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని ఇప్పటివరకు ప్రచారం జరిగినప్పటికీ.. తాజాగా ఒక మైండ్ బ్లోయింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ బాబు డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారట.

Also Read :  Aditya Dhar: ప్రభాస్‌పై కన్నేసిన ‘ధురంధర్’ డైరెక్టర్.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్?

తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ విజువల్ వండర్‌లో మహేష్ బాబు రెండు పౌరాణిక విశిష్టత కలిగిన పాత్రల్లో కనిపించబోతున్నారట. ఒకవైపు శ్రీరాముడిగా, మరోవైపు పరమశివుడిగా మహేష్ బాబు నటన ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ఒకే సినిమాలో ఒకే నటుడు ఇటు రాముడిగా, అటు శివుడిగా కనిపించడం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత అరుదైన విషయంగా మారబోతోందని అంటున్నారు. రాజమౌళి మార్క్ గ్రాఫిక్స్, ఎమోషన్స్‌తో ఈ వారణాసి అద్భుతంగా తెరకెక్కుతుందని సమాచారం. ఈ భారీ విజువల్ వండర్‌ను వచ్చే ఏడాది 2027, ఏప్రిల్ 7వ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం బాబు శివుడిగా, రాముడిగా నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తే మాత్రం బాక్సాఫీస్ రికార్డుల వేట మొదలైనట్లే అని మహేష్ బాబు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.