
Chiru158 Update: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #Chiru158. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది.
ఈ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీగా చేసిన యాక్షన్ స్టంట్స్ చిత్ర యూనిట్‌ను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో రాబోయే ఒక కీలకమైన ఫైట్ సీక్వెన్స్ కోసం చిరంజీవి ఏకధాటిగా 12 గంటల పాటు వర్షంలో తడుస్తూ స్టంట్స్ చేశారట. వయసును లెక్కచేయకుండా సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా రావడం కోసం ఆయన పడుతున్న శ్రమ చూసి సెట్స్‌లోని వారంతా ఫిదా అయ్యారట.
ఈ భారీ యాక్షన్ బ్లాక్‌ను టాలీవుడ్ టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశారట. వందలాది మంది ఫైటర్ల మధ్య, అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ ఫైట్‌ను మేకర్స్ చిత్రీకరించారని చెబుతున్నారు. మెగాస్టార్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్‌గా ఇది నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ తాజా షూటింగ్ అప్డేట్తో మెగా అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి.









