The Paradise: కలెక్షన్ కింగ్‌కే సినిమాటిక్ స్కెచ్.. శ్రీకాంత్ ఓదెల మోసంపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!

The Paradise

The Paradise: ‘ది ప్యారడైజ్’ చిత్ర విజయోత్సవాల వేళ నాని, మోహన్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మధ్య సాగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో ఒక బిగ్ ట్విస్ట్ బయటపడింది. ఈ సినిమా ఒప్పుకునే టైంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనకు చెప్పిన కథా కథనాల గురించి మోహన్ బాబు నేరుగా నాని ముందే పూసగుచ్చినట్లు బయటపెట్టారు. సినిమాలో తన పాత్రకు జోడీగా ఒక ప్రాధాన్యత ఉన్న భార్య క్యారెక్టర్ ఉంటుందని, అందుకోసం ప్రత్యేకంగా ఒక నటిని ఎంపిక చేస్తున్నామని దర్శకుడు నమ్మబలికాడట. రొటీన్ సీనియర్ నటీమణులను కాకుండా, మోహన్ బాబు పక్కన సరికొత్త కాంబినేషన్ కుదరాలనే ఉద్దేశంతో ఆఫీసుకు అమ్మాయిలను పిలిపించి మరీ ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని పెద్ద బిల్డప్ ఇచ్చారు. దర్శకుడు చెప్పిన మాటలు నిజమేనని బలంగా నమ్మిన కలెక్షన్ కింగ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెట్స్ పైకి వెళ్లి ఒక పూర్తి షెడ్యూల్ షూటింగ్‌ను కూడా చకచకా కానిచ్చేశారు.

అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది.. మొదటి షెడ్యూల్ ముగియగానే.. “ఇంతకీ నా సరసన నటించే హీరోయిన్ ఎక్కడ? ఎప్పుడు వస్తుంది?” అని నేరుగా డైరెక్టర్‌ని అడిగినట్లు మోహన్ బాబు చెప్పారు. అప్పుడు శ్రీకాంత్ ఓదెల ఇచ్చిన రియాక్షన్ విని మోహన్ బాబు బిత్తరపోయారట. “కథలో ఆ క్యారెక్టర్ అవసరం లేదనిపించి పూర్తిగా లేపేశాం సార్” అంటూ శ్రీకాంత్ చేతులెత్తేశారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. తనను షూటింగ్‌కు రప్పించేందుకే హీరోయిన్ పాత్ర ఉందంటూ నాటకమాడి బురిడీ కొట్టించారని మోహన్ బాబు నవ్వుతూనే అసలు విషయాన్ని బయటపెట్టారు. నాని సమక్షంలోనే మోహన్ బాబు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడంతో.. పక్కనే ఉన్న శ్రీకాంత్ ఓదెల నవ్వు ఆపుకోలేక ముఖం దాచుకోవాల్సి వచ్చింది. అంతటి సీనియర్ నటుడికే దర్శకుడు ఇచ్చిన ఈ ఊహించని షాక్ గురించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర స్థాయిలో వైరల్ అవుతున్నాయి.