Mowgli : మోగ్లీ కొత్త రిలీజ్ డేట్ !

Mowgli release date
యంగ్ హీరో రోషన్ కనకల రెండో చిత్రం ‘మోగ్లీ 2025’ విడుదలకు సిద్ధమైంది. నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీ.జీ. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ అన్ని కలిసి సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. అసలు డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ఇప్పుడు డిసెంబర్ 13కి మార్చారు, అయితే ప్రీమియర్లు మాత్రం 12 నుంచే ప్రారంభమవుతాయి. రిలీస్ పోస్టర్‌లో రోషన్ కనకల–సాక్షి మడోల్కర్‌ల ఆనందభరిత లుక్స్ కనిపిస్తుండగా, బండి సరోజ్ కుమార్ మాత్రం ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు. ఆధునిక రామ–సీతల ప్రేమ కోసం పోరాడే జంటగా రోషన్, సాక్షి కనిపించగా, వారిని అడ్డుకునే రాక్షసస్వరూపం కలిగిన విలన్‌గా సరోజ్ పాత్రను చూపించారు.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

సినిమా కోసం రోషన్ పూర్తిగా కొత్త లుక్‌ను దాల్చి, అరుదైన స్టంట్స్ కూడా చేశారు. యాక్షన్‌తో కలిసి భావోద్వేగ ప్రేమకథను అందించే ఈ చిత్రంలో హర్షా చెముడు కీలకపాత్రలో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీ రామ మారుతి ఎం, సంగీతం కాలాభైరవ, ఎడిటింగ్ కోడాటి పవన్ కళ్యాణ్, ఆర్ట్ డైరెక్షన్ కిరణ్ మమిడి, యాక్షన్ న‌ట‌రాజ్ మడిగొండ అందించారు. ఇంకా మూడు రోజుల్లో థియేటర్లు చేరబోయే ఈ లవ్ & యాక్షన్ డ్రామా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.