Naga Vamsi : వార్-2 దెబ్బ.. నాగవంశీ సంచలన నిర్ణయం

War 2

Naga Vamsi : సినీ పరిశ్రమలో 24 శాఖల కార్మికులు, సంఘాలు సమ్మె కొనసాగిస్తుండగా, నిర్మాత నాగవంశీ పరిస్థితి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా కింగ్డమ్, వార్-2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవ్వడంతో ఆయన గురించిన చర్చలు మరింత పెరిగాయి. ముఖ్యంగా వార్-2 భారీ నష్టాలు తెచ్చిపెట్టడంతో నాగవంశీ పూర్తిగా మౌనం దాల్చడం గాసిప్స్‌కు మరింత ఊతమిచ్చింది.

యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌లు, చిన్న సినిమాలతో ఎప్పుడూ జోరుగా కనిపించే నాగవంశీకి వార్-2 సినిమా సడెన్ బ్రేక్ వేసింది. ట్రేడ్ టాక్ ప్రకారం, ఈ చిత్రాన్ని ఆయన సుమారు 90 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల గ్రాస్ కూడా రాబట్టని స్థితి కనిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ వలన నాగవంశీకి దాదాపు 50 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సినీ వర్గాలు అంటున్నాయి.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

ఇక సినిమా విడుదలైన తర్వాత నాగవంశీ మీడియా, సోషల్ మీడియా రెండింటికీ పూర్తిగా దూరమయ్యారు. ఆయన రాబోయే మాస్ జాతర సినిమా గురించే కూడా ఎటువంటి ప్రమోషన్లు చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ఈ మూవీ ఆగస్టు చివర్లో రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పుడు రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలోనే విడుదల చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో బలంగా ప్రచారం జరుగుతోంది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఇక ముందు నుండి నాగవంశీ మీడియా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఆయన మౌనం రూమర్లకు మరింత స్థానం కల్పిస్తోంది.

అయితే నాగవంశీ సన్నిహితుల ప్రకారం– “హిట్స్, ఫ్లాప్స్ ఆయన కెరీర్‌లో కొత్తేమీ కాదు. త్వరలోనే తనదైన శైలిలో స్పందిస్తారు. అప్పటివరకు కొంత ఓపిక పట్టాలి” అంటూ చెబుతున్నారు. అంటే, వార్-2 దెబ్బ నాగవంశీకి భారీ షాక్ ఇచ్చినా, ఆయన సంచలన నిర్ణయాలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.