Nara Rohith : పవన్ ను ఇంత మాట అన్నండేంటీ నారా రోహిత్

Nara rohith

Nara Rohith: ప్రసిద్ధ నటుడు నారా రోహిత్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇంట్రావర్ట్‌ అయినప్పటికీ, రాజకీయాల్లోకి వస్తే ప్రతీ ప్రశ్నకు, విమర్శకు దీటుగా సమాధానం చెప్పగలనని ఆయన స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, సినిమాల్లో ఇంట్రావర్ట్‌గా ఉన్న పవన్ కల్యాణ్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్లారని గుర్తుచేశారు. “నేను కూడా అలాంటి అవకాశం వస్తే అదే విధంగా స్పందిస్తా” అని ఆయన పేర్కొన్నారు.

Also Read :  Director Prashanth Neel: ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో టాప్ ట్రెండింగ్‌లో ప్రశాంత్ నీల్.. రీజన్ ఇదే!

హైదరాబాద్‌లో జరిగిన తన కొత్త సినిమా ‘సుందరకాండ’ ప్రమోషన్లలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక జర్నలిస్ట్ “మీరు ఇంట్రావర్ట్ కదా, రాజకీయాల్లో అది హర్డిల్ కాదా?” అని అడగగా, నారా రోహిత్ “మా పెదనాన్న ఏ స్థాయిలో రాజకీయాల్లో రాణించారో అందరికీ తెలుసు. నేను ఆ కుటుంబం నుంచే వచ్చాను. ఇంట్రావర్ట్‌ అని రాజకీయాల్లో రాణించలేరనుకోవడం సరికాదు” అని బదులిచ్చారు. ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రంలో నారా రోహిత్ సరసన శ్రీదేవి విజయ్ కుమార్, వృత్తి వాగాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల కానుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. నారా రోహిత్ ప్రస్తుతానికి విస్తృతంగా ప్రమోషన్లలో పాల్గొంటూ, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.