
Sundarakanda : హీరో నారా రోహిత్ తన 20వ సినిమా ‘సుందరకాండ’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తుండగా, సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంజీవ్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా నారా రోహిత్ పాత్రపై క్లారిటీ వచ్చింది — హాస్యం మరియు భావోద్వేగాలతో నడిచే, జీవితాన్ని సింపుల్‌గా చూసే మధ్య వయస్సు బ్యాచిలర్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. లైట్‌హార్ట్ మూడ్‌కి అనుగుణంగా ఈ సినిమా వినోదాత్మక అనుభూతిని అందించనుంది.
ఈరోజు నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ‘సుందరకాండ’ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. గణేశ్ చతుర్థి సందర్భంగా, ఆగస్ట్ 27న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. విడుదల పోస్టర్‌లో శ్రీదేవి విజయ్‌కుమార్‌తో తొలిప్రేమను, వృతి వాఘానీతో రెండో అవకాశాన్ని సూచించేలా నారా రోహిత్ పాత్రను చూపించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, సిద్ధ్ శ్రీరాం పాడిన “బహుశా బహుశా” పాటకు మంచి స్పందన వచ్చింది. విడుదలకు ఇంకా నెలరోజుల సమయం ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి.
Get ready for a fun ride filled with confusion, comedy, and a lot of heart.❤️ #Sundarakanda in cinemas August 27th
@virtivaghani @V_Nimmalapudi #SrideviVijayKumar @ItsActorNaresh #Vasuki @leon_james @rajeshartD #PradeeshMVarma @chillaleRohan @IamSantoshCH @aranmediaworks… pic.twitter.com/ptfcSRZUB4
— Rohith Nara (@IamRohithNara) July 25, 2025












