Varanasi: రూమరా? నిజమా? మహేష్ బాబు గ్లోబల్ ప్రాజెక్ట్‌తో ఎన్టీఆర్ కొడుకు సినీ ఎంట్రీ!

Bhargav Ram

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సంచలన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు పోషిస్తున్న ‘రుద్ర’ పాత్రకు సంబంధించిన చిన్ననాటి పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌ను ఎంపిక చేసినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజమౌళి సినిమాల్లో బాలనటుల పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలో మహేష్ బాబు చిన్నప్పటి లుక్‌లో భార్గవ్ రామ్ కనిపిస్తే థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలే అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

దర్శకధీరుడు రాజమౌళికి, ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం మనకు తెలిసిందే. అలాగే మహేష్ బాబు, తారక్ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. ఈ సమీకరణాల వల్లే భార్గవ్ రామ్ సినీ ఎంట్రీకి ఇదే సరైన వేదిక అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ గానీ, ఎన్టీఆర్ కుటుంబం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ రూమర్లలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. మల్టిపుల్ టైమ్‌లైన్స్, పురాణాల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్‌లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.