
Sundarakanda : హీరో నారా రోహిత్ తన 20వ చిత్రంగా రూపొందుతున్న ‘సుందరకాండ’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ‘ప్లీజ్ మేమ్’ సాంగ్ ని రిలీజ్ చేశారు. మోడ్రన్ బీట్‌లతో పాటు తెలుగుదనం మేళవించి, ఫన్ ఫుల్ లిరిక్స్‌తో రూపొందిన ఈ పాట, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో తన స్నేహితులతో కలిసి హీరోయిన్ శ్రీదేవిని ఇంప్రెస్ చేయడానికి చేసే ప్రయత్నాలు వినోదాత్మకంగా చూపించారు.
ఈ పాటను అర్జున్ చాందీ, దీపక్ బ్లూ, అరవింద్ శ్రీనివాస్, సాయిశరణ్, రేష్మా శ్యామ్, హరిప్రియా, లవితా లోబో కలిసి పాడగా, వారి వాయిస్‌ల మిక్స్ పాటకు మరింత ఎనర్జీని తీసుకొచ్చింది. కొరియోగ్రఫీ విషయంలో విశ్వరఘు స్టైలిష్ డాన్స్ మూమెంట్స్‌ను అందించి ఆకట్టుకున్నారు. నారా రోహిత్ – శ్రీదేవి విజయ్ కుమార్ మధ్య కెమిస్ట్రీ బ్యూటిఫుల్‌గా కనిపిస్తుండగా, వృతి వాఘాని కథానాయికగా నటిస్తున్నారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది.












