
Raja Saab : భారతీయ సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటప్రస్థానం నేటికి 23 ఏళ్లు పూర్తయింది. 2002 నవంబర్ 11న విడుదలైన “ఈశ్వర్” సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన ప్రభాస్, వరుసగా “రాఘవేంద్ర”, “వర్షం”, “ఛత్రపతి”, “బుజ్జిగాడు”, “బిల్లా”, “డార్లింగ్”, “మిస్టర్ పర్‌ఫెక్ట్”, “మిర్చి” వంటి చిత్రాలతో స్టార్‌డమ్ సాధించారు. అయితే ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది మాత్రం “బాహుబలి” సినిమా. ఆ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తర్వాత “సాహో”, “సలార్”, “కల్కి 2898 ఎడి” సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డ్ సృష్టించారు.
ఇక ప్రభాస్ సినీ ప్రస్థానం 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులు భారీగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఈ స్పెషల్ డేను పురస్కరించుకొని ఆయన తాజా సినిమా “రాజా సాబ్” నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో కొత్త లుక్‌లో కనిపించిన ప్రభాస్ స్టైలిష్‌గా ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే, ప్రభాస్ ప్రస్తుతం “సలార్ 2”, “స్పిరిట్”, “ఫౌజీ”, “కల్కి 2” వంటి భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.
It’s 23 years of rewriting box office history of turning every Friday into a festival ❤️🔥
All these years were one thing.
On January 9th, you’ll witness something new. 🔥All hail THE REBELWOOD 👑#23YearsForRebelWood #Prabhas #TheRajaSaab pic.twitter.com/lV0zxsQ06T
— The RajaSaab (@rajasaabmovie) November 11, 2025












