
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా ఏడేళ్ల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో.. ఈ ప్రొఫైల్ పిక్చర్ మార్పు సినిమాపై ఆయనకున్న నమ్మకాన్ని సూచిస్తోందంటూ అభిమానులు జోరుగా చర్చించుకుంటున్నారు. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’లో ప్రభాస్ ఓ దేశభక్తి గల సైనికుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్, హిస్టారికల్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
‘ఫౌజీ’ను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో ప్రభాస్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక గతంలో ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ సినిమాల సమయంలోనూ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చలేదని అభిమానులు గుర్తుచేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ‘ఫౌజీ’ కోసం ఏడేళ్ల తర్వాత ప్రొఫైల్ పిక్ మార్చడంతో.. ఈ సినిమాపై ప్రభాస్‌కు ప్రత్యేకమైన కాన్ఫిడెన్స్ ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. తాజాగా ప్రభాస్ చేసిన ఈ చిన్న మార్పు కూడా సోషల్ మీడియాలో అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.














