
Korean Kanakaraju Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి హైప్ ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా, సంగీత దర్శకుడు ఎస్.తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్స్, మేకింగ్ క్వాలిటీ, వరుణ్ తేజ్ మేకోవర్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
పెనుకొండ నుంచి కొరియా వరకు సాగే ఆసక్తికరమైన స్టోరీతో ఈ చిత్రాన్ని డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. టీజర్‌ను బట్టి చూస్తే వినోదానికి ప్రాధాన్యత ఇస్తూనే యాక్షన్, ఎమోషన్లను సమపాళ్లలో మేళవించిన కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ కొత్త లుక్, పాత్ర తీరు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సౌత్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.












