
Spirit : రెబల్ స్టార్ ప్రభాస్, హిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ చివరి నుండి ప్రారంభం కానుందని టీం అధికారికంగా తెలియజేసింది. హై-ఆక్టేన్ పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో, అనిమల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. మొదటిసారి ప్రభాస్ సరసన కనిపించబోతున్న ఆమె ఈ చిత్రానికి స్పెషల్ ఆకర్షణ కానుంది.
ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొమ్మిది భాషలలో విడుదల చేయడానికి ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు. మ్యాసివ్ స్కేల్, ఫ్రెష్ లీడ్ పెయిర్, మరియు సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడితో ఈ సినిమా భారతీయ సినిమాలలో ఓ మైలురాయిగా నిలవనుంది.












