PR05: మళ్లీ లవ్ టుడే రేంజ్ హంగామా.. ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీలో ‘డెలులు’ బ్యూటీ!

PR05

PR05: ‘లవ్ టుడే’ సినిమాతో సౌత్ ఇండియా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్రకు రెడీ అవుతున్నారు. నటుడిగా, దర్శకుడిగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. తన ఐదో ప్రాజెక్ట్ (#PR05) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ప్రదీప్ రంగనాథన్ స్వయంగా నటిస్తూ, ఆయనే దర్శకత్వం వహించబోతుండటం విశేషం.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా హీరోయిన్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రముఖ మలయాళీ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ శిబు తమీన్స్ కుమార్తె రియా శిబు (Riya Shibu) ఫిక్స్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. సర్వం మాయలో ‘డెలులు’ (Delulu) బ్యూటీగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న రియా శిబు, ఈ చిత్రంతో ప్రదీప్ సరసన జోడీ కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.

Also Read :  Ram Pothineni నెక్స్ట్ సినిమా బడ్జెట్ లాక్.. ఎన్ని కోట్లో తెలుసా?

గతంలో ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్ వహించి, నటించిన సినిమాలు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు #PR05 చిత్రంలో కూడా అదే స్థాయి వినోదాన్ని, యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌ను ప్రేక్షకులు ఆశించవచ్చని మేకర్స్ చెబుతున్నారు. రియా శిబు క్యూట్‌నెస్ – ప్రదీప్ రంగనాథన్ బ్రాండ్ ఇమేజ్ తోడైతే ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా కూడా భారీ హైప్ క్రియేట్ చేయడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.