Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్

Prakashraj
Betting Apps Case : ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో బుధవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి వంటి 29 మంది సినీ ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ యాప్‌ల ద్వారా భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఈ కేసులో ఇప్పటికే రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వంటి టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. రానా షూటింగ్‌ల కారణంగా విచారణకు మరికొంత సమయం కోరగా, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13న ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం వల్ల వాటిని ఉపయోగించి నేరాలకు పాల్పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.