Prakash Raj: దేవి శ్రీ ప్రసాద్ డెబ్యూ మూవీలో వర్సటైల్ యాక్టర్ ఎంట్రీ!

Prakash Raj

Prakash Raj: టాప్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) హీరోగా పరిచయమవుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. బలమైన కుటుంబ భావోద్వేగాలు, హార్ట్ టచింగ్ ఎమోషనల్ నరేషన్‌తో సాగే ఈ కథలో ప్రకాష్ రాజ్ పాత్ర సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందని మేకర్స్ భావించారట.

Also Read :  Toxic: ఆగస్ట్‌లో రాకింగ్ స్టార్ ‘టాక్సిక్’! రేపే అఫీషియల్ అనౌన్స్‌మెంట్?

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ గూజ్ బంప్స్ తెప్పించి, సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం చిత్ర బృందం దేవి శ్రీ ప్రసాద్ కాల్షీట్ల కోసం ఎదురుచూస్తోంది. డీఎస్‌పీ డేట్స్ అడ్జస్ట్ అయిన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేయడానికి డైరెక్టర్ వేణు యెల్దండి అండ్ టీమ్ అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకుందట. వినూత్నమైన స్టోరీ లైన్‌తో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలోనే ప్రకాష్ రాజ్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట.