Coolie : 500 కోట్ల మార్క్ దిశగా కూలీ..!

Coolie

Coolie : సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ ఆగస్టు 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కి ముందే పెద్ద ఎత్తున హైప్ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం, భారీ ఓపెనింగ్స్‌తో తన బాక్సాఫీస్ వేటను ప్రారంభించింది. చాలా రోజులుగా థియేటర్ల వద్ద తగ్గిన సందడి, రజనీ సినిమా వచ్చాక మళ్లీ ఉత్సాహంగా మారింది. తొలి రోజు నుంచే కూలీ కొత్త రికార్డుల బాట పట్టింది.

మొదటి వారంలోనే ఈ సినిమా రూ.444 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రస్తుత ట్రేడ్ టాక్ ప్రకారం, కూలీ రూ.460 కోట్ల మార్క్‌ను దాటితే, మరికొన్ని రికార్డులు తిరగరాయబడతాయని అంటున్నారు. 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశమూ బలంగానే కనిపిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిందని, అదే ఊపు కొనసాగి ఉంటే ఇప్పటికే ఆ మైలురాయి చేరుకునేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

తమిళనాట అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 మూవీస్ జాబితాలో ఇప్పటికే రజనీ సినిమాలు 2.0 మరియు జైలర్ ఉన్నాయి. ఇప్పుడు కూలీ ఆ జాబితాలో 6వ స్థానంలోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే టాప్ 5లో చోటు దక్కించుకోవచ్చని అంచనా. రజనీ ఫ్యాన్స్ ఒకవైపు కూలీ విజయాన్ని సంబరంగా జరుపుకుంటూ, మరోవైపు జైలర్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, రజనీ – కమల్ హాసన్ కాంబినేషన్‌లో కొత్త సినిమా వస్తుందనే వార్త కోలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ నిజం అవుతుందా అన్న ఆసక్తి పెరిగింది.