Ram Charan: బుచ్చిబాబుకు రామ్ చరణ్ బంపర్ ఆఫర్.. ‘కథ రెడీ చేస్కో.. రెండో సినిమా చేద్దాం’!

Buchi Babu Sana

Ram Charan: టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ గురించే చర్చ నడుస్తోంది. మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 250 కోట్ల క్లబ్‌ వైపు దూసుకుపోతుండటంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ క్రేజీ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో రామ్ చరణ్.. దర్శకుడు బుచ్చిబాబుకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. బుచ్చిబాబు వర్కింగ్ స్టైల్, అవుట్‌పుట్ పట్ల ఎంతో ఇంప్రెస్ అయిన రామ్ చరణ్.. ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. “నువ్వు కథ రెడీ చేస్కో.. మన కాంబోలో రెండో సినిమా చేద్దాం” అని చరణ్ స్వయంగా బుచ్చిబాబుకు ప్రామిస్ చేసినట్లు ఇండస్ట్రీ ఇన్నర్ టాక్.

Also Read :  Buchi Babu: పెళ్లి రోజున కూడా కంటిమీద కునుకు లేదు.. 'పెద్ది' కోసం బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ తపస్సు!

ప్రస్తుతం రామ్ చరణ్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పెద్ది తర్వాత చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్ సాధించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ సినిమా పూర్తయిన తర్వాతే చరణ్-బుచ్చిబాబుల రెండో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. మరి బుచ్చిబాబు చరణ్ కోసం ఈసారి ఎలాంటి కథను సిద్ధం చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.