
Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ షూటింగ్ పూర్తయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్, పాటలు, టీజర్ వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. చివరి పాటను జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో హైదరాబాద్‌లోని సెట్‌లో రామ్, భాగ్యశ్రీ బోర్సేపై చిత్రీకరించారు. షూటింగ్ ముగిసిన సందర్భంగా, ” షూటింగ్ పూర్తయింది. నేను గర్వపడే సినిమా.. మనమందరం గర్వపడే సినిమా..! నా కెరీర్‌లో ఈ అందమైన సినిమా ఇచ్చిన మహేష్ కి ధన్యవాదాలు. నవంబర్ 28న ఆంధ్ర కింగ్ తాలూకా మీ ముందుకు వస్తోంది’ అంటూ రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్-మర్విన్ సంగీతం అందించగా, సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహించారు. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.
Finally wrapped the shoot.
A film I’m proud of..
A film we will all be proud of..Soon!Thank you @filmymahesh for this beautiful film in my career.#AndhraKingTaluka is coming to you..#AKTonNOV28 pic.twitter.com/obNzzH5lcx
— RAm POthineni (@ramsayz) November 2, 2025












