Andhra King Taluka : ఫ్యాన్స్ హంగామా మధ్య విడుదలైన రామ్ పోతినేని ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్!

Akt
Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. వివేక్ & మెర్విన్ అందించిన సంగీతం ఇప్పటికే ట్రెండ్ అవుతోంది. తొలి మూడు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ఇప్పుడు మేకర్స్ విడుదల చేసిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

ఈ సాంగ్‌ను అభిమానులు విమల్ థియేటర్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. భారీగా హాజరైన అభిమానుల మధ్య హీరో రామ్ కటౌట్ లాంచ్ చేస్తూ ఈవెంట్ జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిమానుల ఫీలింగ్స్‌, థియేటర్‌లోని ఆ ఫస్ట్ షో అనుభూతిని ప్రతిబింబించేలా ఈ పాట రూపొందించబడింది. దినేష్ కాకర్ల రాసిన లిరిక్స్ అభిమానుల ప్రేమ, క్రేజ్, అంకితభావాన్ని ప్రతీ లైన్‌లో చూపిస్తాయి. రామ్ పోతినేని తన డాన్స్ మూవ్స్, ఎనర్జీతో స్క్రీన్‌ను దద్దరిల్లేలా చేశాడు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, రొమాన్స్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం రామ్ కెరీర్‌లో మరో ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌గా నిలిచేలా కనిపిస్తోంది.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!