Rasha Thadani: ‘ప్రభాస్ సర్ ఎప్పుడూ నాకు అండగా నిలిచారు’.. రషా థడానీ

Rasha

Rasha Thadani: బాలీవుడ్ నటి రవీనా టండన్ కుమార్తె రషా థడానీ త్వరలో టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. జూలై 30న విడుదల కానున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయం కానున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ తన సినీ ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని రషా తెలిపారు. “నా తొలి సినిమా నుంచే ప్రభాస్ సర్ నాకు అండగా ఉన్నారు. ఎప్పుడూ నన్ను మోటివేట్ చేస్తుంటారు. నా పనిని మెచ్చుకుంటారు. నా సినిమాలను ప్రమోట్ చేయడమే కాకుండా, నా గురించి మా నాన్నకు కూడా వాయిస్ నోట్స్ పంపిస్తూ నన్ను ప్రోత్సహిస్తుంటారు. ఆయన నుంచి లభిస్తున్న ఈ ప్రేమ, సపోర్ట్‌కు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని” అని ఆమె భావోద్వేగంగా చెప్పారు.

రషా కామెంట్స్‌పై డార్లింగ్ అభిమానులు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెడుతున్న నటీనటులను ప్రోత్సహించడంలో ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నటీనటులు కూడా ప్రభాస్ సింప్లిసిటీ, హెల్పింగ్ నేచర్ గురించి ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇక ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో రషా థడానీ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి. టాలీవుడ్‌లో ఆమె ఎంట్రీపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.