The Girlfriend OTT : రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇప్పుడు OTT లో స్ట్రీమింగ్!

Thegirlfriend
The Girlfriend OTT : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచింది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మికకు జోడీగా దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి నటించారు. నవంబర్ 7న విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లు రాబట్టింది. ప్రత్యేకంగా మహిళా ప్రేక్షకుల నుండి ఈ సినిమా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 5 నుంచి ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.