
Raktha Charitra: సినీ ప్రియులను, ముఖ్యంగా రా అండ్ రస్టిక్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ పొలిటికల్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘రక్త చరిత్ర’ (Raktha Charitra) మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా విడుదలై విజయవంతంగా 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. మేకర్స్ ఈ చిత్రాన్ని 4K అల్ట్రా హెచ్డీ వెర్షన్లో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నారు. నట్టి కుమార్ సమర్పణలో ‘నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై ఈ చిత్రం భారీ ఎత్తున రీ-రిలీజ్‌కు రెడీ అవుతుంది.
అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాను సరికొత్త టెక్నాలజీ, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ – పవర్ఫుల్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో రీ-మాస్టర్ చేశారు. ఈ ఏడాది (2026) జూలై నెలలో ‘రక్త చరిత్ర 4K’ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని వెల్లడించారు. రక్తపాతం, పగ, ప్రతికారాల నేపథ్యంతో సాగే ఈ పవర్ఫుల్ బ్యాటిల్‌ను వెండితెరపై చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇంటెన్స్ యాక్టింగ్, రాధికా ఆప్టే నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆర్జీవీ మార్క్ మేకింగ్‌తో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ చిత్రం 4K వెర్షన్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తుందో చూడాలి. త్వరలోనే ఈ రీ-రిలీజ్ థియేటర్ల లిస్ట్, ట్రైలర్, అఫీషియల్ రిలీజ్ డేట్ వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.
#RakthaCharitra4K 🔥 16 Years of Legacy
The blood. The battle. The power.
The storm that created history returns to the big screen. 🔥This July 2026 in Theatres 🔥@RGVzoomin @vivekoberoi @Suriya_offl @radhika_apte#Nattikumar #NattisEntertainments #RakthaCharitra #RGV pic.twitter.com/qVrA0Dn98M
— Natti kumar (@Nattikumar7) June 20, 2026









