The 100 : త్రేతాలో రామబాణం, ద్వాపరలో సుదర్శన చక్రం లాగా.. కలియుగానికి ‘ది 100’ – RK సాగర్


The 100 : యాక్షన్, థ్రిల్, ఇన్వెస్టిగేషన్ ఈ మూడింటినీ మిక్స్ చేసిన క్రైమ్ థ్రిల్లర్‌ ‘ది 100’తో నటుడు ఆర్కే సాగర్ స్క్రీన్ పై గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఈ సినిమాతో ఆయన మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు ఈ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇక జూలై 11న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హీరో ఆర్కే సాగర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ సినిమాకి ‘ది 100’ టైటిల్ పెట్టడానికి కారణం?
మేము ఒక సినిమాలాగే ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాను. ‘ది 100’ అనే టైటిల్ వచ్చిన తర్వాత సినిమాకి ఒక ఎమోషన్ వచ్చింది. సొసైటీకి ఏదైనా మంచి చేయాలి అనే తపనతో పెట్టిన టైటిల్ ఇది. లక్కీగా కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా కుదిరింది. సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి 100 అనే టైటిల్ ఎందుకు పెట్టామో మీకు తెలుస్తుంది.

ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ది 100. ఈ సినిమాకి అంత పవర్ ఉంది. వెరీ టచింగ్ పాయింట్. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమా మస్ట్ గా చూడాలి.

ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమా గురించి చాలా ఎమోషనల్ అయ్యారు కదా.. మీకు ఎలా అనిపించింది?
మంత్రిగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆయన ఈవెంట్ కి ఒక గెస్ట్ గా వచ్చి మా పుటేజ్ చూసి చాలా అద్భుతంగా ఫీలయ్యారు. మమ్మల్ని గొప్పగా బ్లెస్ చేశారు. ఆయనకి కంటెంట్ చెప్పాను. ఆయన కచ్చితంగా ఫస్ట్ ఈ సినిమా చూస్తానని చెప్పారు. సినిమా చూసిన తర్వాత ఇంకా గొప్పగా చెప్తారని భావిస్తున్నాను.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్ళాము. నిజానికి ఒక రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసి ఉంటే ఆయన దగ్గరికి వెళ్లే వాళ్ళం కాదు. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అందరికీ రీచ్ అవ్వాలి. అలా రీచ్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు మాట్లాడితే ఇంకా అద్భుతంగా రీచ్ అవుతుంది. కళ్యాణ్ గారికి కంటెంట్ చాలా బాగా నచ్చింది. అందుకే ఆయన ట్రైలర్ ని లాంచ్ చేశారు.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
ఇప్పటివరకు చాలా పోలీస్ క్యారెక్టర్స్ వచ్చాయి కానీ ఇందులో క్యారెక్టర్ మాత్రం ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్లే ఈ విషయం చెప్తారు.

మొగలిరేకులు సీరియల్ లో ఆర్ కె నాయుడు క్యారెక్టర్ చాలా మంచి పేరు తీసుకొచ్చింది కదా.. మళ్ళీ అలాంటి క్యారెక్టర్ తో సినిమా ఎందుకు చేయలేదు?
దాదాపు ఆరు సంవత్సరాలు నేను ఆర్కే నాయుడు క్యారెక్టర్ లోనే ఉన్నాను. సినిమాల్లో చేసినప్పుడు ఆ క్యారెక్టర్ కి భిన్నమైన క్యారెక్టర్స్ ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనే ఆలోచనతో మాన్ అఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, సాది ముబారక్ లాంటి సినిమాలు చేశాను. ఆడియన్స్ మళ్ళీ ఒక పోలీస్ క్యారెక్టర్ ని కోరుకున్నారు. అలా పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే మళ్ళీ ఒక బలమైన కథ కుదరాలి. అలాంటి కథ 100లో కుదిరింది. ఈ క్యారెక్టర్ ఆర్కే నాయుడు కంటే అథెంటిక్ గా ఉంటుంది.

ఈ కథ ఎలా పుట్టింది?
ఇది ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఆలోచన. సినిమాగా తీసుకోవచ్చా అని అడిగాను. పేరు పెట్టకుండా తీసుకోవచ్చు అని చెప్పారు. దాదాపు ఆలోచనని నాలుగు సంవత్సరాలు పాటు నా బుర్రలో మోసాను. ఒకసారి సుకుమార్ గారి దగ్గరికి లంచ్ కి వెళ్ళాను. కథల గురించి డిస్కషన్ వచ్చింది. అప్పుడు ఈ కథ చెప్పాను. ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు. ముందు ఇలాంటి కథ చేయాలని చెప్పారు. వాళ్ళ టీం తో కొన్ని రోజులు జర్నీ జరిగింది. తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్స్ లో బిజీ అయ్యారు. ఈ కథ చేసుకుంటానని ఆయనకి చెప్పాను. తర్వాత కథని పూర్తిస్థాయిలో సిద్ధం చేశాం. 100% కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లాం.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

ఈ మధ్యకాలంలో మీరు మిస్సయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా?
ఓజి సినిమాలో ఒక ఆఫర్ వచ్చింది. కానీ ఏదో మిస్ కమ్యూనికేషన్ వల్ల అది కుదరలేదు. అయితే ఆయనతో ఉంటున్నాం కాబట్టి మిస్ అయిన ఫీలింగ్ కలగడం లేదు.

మిషా, ధన్య క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి?
మిషా క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చూస్తే కళ్ళల్లో నీళ్లు ఆగవు. మిషా, ధన్య, విష్ణు ప్రియ.. ఈ మూడు క్యారెక్టర్ లో సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి.

హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ గురించి?
హర్షవర్ధన్ రామేశ్వర గారి మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. తను కథ విన్నప్పుడే చాలా చాలెంజ్ గా తీసుకున్నారు. ఆయన మ్యూజిక్ కి చాలా మంచి మార్క్స్ పడతాయి.

మీకేమైనా డ్రీమ్ క్యారెక్టర్స్ ఉన్నాయా ?
నాకు ఇష్టమైన సినిమా నాయకుడు. ఎన్నోసార్లు ఆ సినిమాని చూశాను. అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఉంది.

మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ?
నాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ వర్క్ ఇవ్వడం ఇష్టం. ఆడియన్స్ నాకు చాలా ప్రేమ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ లాగా చూసుకున్నారు. వాళ్ళకి క్వాలిటీ కంటెంట్నే ఇవ్వాలి. అందుకే చాలా మంచి కథలతోనే సినిమాలు చేయాలని ఉంది. నా నెక్స్ట్ ప్రాజెక్టు కి ఇంత గ్యాప్ ఉండదు. అది తొందరలోనే వస్తుంది. అలాగే ‘ది 100’ సినిమాకి సీక్వెల్ చేసే ఛాన్స్ కూడా ఉంది.