Romanchakam Trailer: ‘రోమాంచకం’ ట్రైలర్‌ వచ్చేసింది.. సందీప్‌ రెడ్డి వంగా ప్రెజెంట్స్‌లో అదిరిపోయే లవ్‌స్టోరీ!

Romanchakam Trailer

Romanchakam Trailer: యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ‘రోమాంచకం’ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సానిల్‌కుమార్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను మేకర్స్‌ తాజాగా విడుదల చేశారు. లవ్‌, కామెడీ, ఎమోషన్‌తో పాటు సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్‌ చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే సుమంత్‌ ప్రభాస్‌, అనంతికల ప్రేమకథ చుట్టూనే సినిమా ప్రధానంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తొలుత ఇద్దరి మధ్య క్యూట్‌ లవ్‌స్టోరీగా కనిపించిన కథ.. ఆ తర్వాత విభేదాలు, భావోద్వేగ సంఘర్షణలు, అనూహ్య పరిణామాలతో మరో మలుపు తిరిగినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ‘‘యూ రూయిన్డ్‌ మై లైఫ్‌.. ఐ విష్‌ ఐ హేట్‌ యూ’’ అనే డైలాగ్‌ కథలోని ఎమోషనల్‌ కాన్‌ఫ్లిక్ట్‌ను హైలైట్‌ చేస్తోంది.

ఇక ప్రేమికుల జీవితాల్లో స్నేహితుల జోక్యం, కుటుంబ సంబంధాలు, వారి మధ్య చోటుచేసుకునే సంఘటనలు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. ‘‘ఎవరికో ఏదో నిరూపించుకోవాలని నిన్ను నువ్వు మోసం చేసుకోకు’’ అనే డైలాగ్‌ కూడా ట్రైలర్‌లో ఆకట్టుకుంది. విజువల్స్‌, మ్యూజిక్‌ యూత్‌ను ఆకర్షించేలా ఉన్నాయి. ఈ చిత్రాన్ని సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా సమర్పిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్‌ బ్యానర్‌పై ఆయన సోదరుడు ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. వేణు గోపాల్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.