
Mowgli : యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా తన కేరీర్లో బాగా పుంజుకుంటున్నాడు. వరుస సినిమాల్లో నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటున్న రోషన్, ఇప్పుడు ‘మోగ్లీ’ సినిమాలో కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఇదిలా ఉండగా, ‘మోగ్లీ’ ద్వారా బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాక్షి మడోల్కర్ టాలీవుడ్ లోకి పరిచయం అవుతున్నారు. పలు బ్రాండ్స్ యాడ్స్‌లో తన అందంతో ఆకట్టుకున్న సాక్షి, ఈ సినిమాలో రోషన్ కనకాలతో రొమాంటిక్ కేయర్ అందిస్తోంది.
సినిమాకు సంబంధించిన అన్ని అప్డేట్స్ ప్రేక్షకులను భారీగా ఆకట్టుకుంటున్నాయి. నేడు సాక్షి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి, ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, “మా రామ చిలుక మీ ముందుకు రాబోతుంది. అందమైన జాస్మిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘మోగ్లీ’తో ఆమెకు సక్సెస్ ఫుల్ ఎంట్రీ కాబోతుంది” అని పేర్కొన్నారు. పోస్టర్లో సాక్షి గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ చీర, స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుని అందం అదరగొడుతూ చూపిస్తున్నారు. ఆమె హాట్ లుక్ ఫ్యాన్స్‌కి ఆకర్షణగా మారింది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతూ, ‘మోగ్లీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.











