
Maa Inti Bangaaram : సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్యతో పాటు శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజుషా వంటి పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఓ బేబి తర్వాత మరోసారి సమంత – నందిని రెడ్డి కాంబినేషన్‌లో వస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని రాజ్ నిడిమోరు రూపొందిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాను మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పక్కా కమర్షియల్ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల కోసం సమంత చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల విడుదలైన ఆమె లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి హైలైట్ అయింది. ఇక ఇప్పటికే టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని సమంతతో పాటు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి నిర్మిస్తున్నారు.









