Samantha: బేబీ బంప్‌తో కనిపించిన సమంత?

Adhika masa purnima

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సరికొత్త వసంతం మొదలైనట్లు కనిపిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ, సొంతంగా నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, కేవలం ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా క్లీన్ బ్రేక్ ఈవెన్ మార్కును అందుకొని నిర్మాతగా సమంతకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సామ్, శనివారం నాడు చిత్ర యూనిట్‌తో కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.

Also Read :  Kajal Aggarwal: బాలయ్య సినిమాలో కాజల్ అగర్వాల్.. బర్త్‌డే గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసిన టీమ్!

అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో సినిమా హిట్ టాక్ మాత్రమే కాదు, సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక క్రేజీ గుడ్ న్యూస్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత వైట్ కలర్ టీషర్ట్ ధరించి కనిపించారు. అందులో ఆమెకు బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుండటంతో సామ్ ప్రెగ్నెంట్ అనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తమకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ త్వరలోనే తల్లి కాబోతుందనే సంకేతాలు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సమంత, ప్రముఖ దర్శకుడు కమ్ ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరు గతేడాది డిసెంబర్‌లో వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. పెళ్లయిన కొన్ని నెలలకే ఈ మెగా సక్సెస్, అలాగే ప్రెగ్నెన్సీ వార్తలు రావడంతో సోషల్ మీడియాలో కంగ్రాచ్యులేషన్స్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆమె ప్రెగ్నెన్సీ గురించి ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై సమంత లేదా రాజ్ నిడిమోరుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.