Sandeep – Prabhas : వంగా వల్ల ప్రభాస్ ‘ఫౌజీ’కి ప్రాబ్లం..!

Prabhas fouji

 

Sandeep – Prabhas : బాహుబలి వచ్చిన తర్వాత ప్రభాస్ కెరీర్‌లో చాలా మార్పులు జరిగాయి. అప్పటి నుంచి ఆయన ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేస్తూ బిజీగా గడిపేవాడు. షూటింగ్‌లు, ప్రాజెక్టులు అన్నీ కలిపి మల్టీటాస్కింగ్‌ చేసే అలవాటు పడిపోయాడు. కానీ ఇప్పుడు ఆ స్టైల్‌ను మార్చేసే అవకాశం కనిపిస్తోంది.

‘అర్జున్ రెడ్డి’, ‘ఆనిమల్’ సినిమాలతో పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోతున్న ‘స్పిరిట్’ సినిమాలో మాత్రం ఆయన పూర్తిగా కమిట్ కావాలంటూ డైరెక్టర్ చెబుతున్నాడట. ఆశ్చర్యమే కానీ, ప్రభాస్ కూడా ఓకే చెప్పేశాడని సమాచారం!

ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ సెప్టెంబర్లో మొదలవుతుంది. దానికోసం ప్రభాస్ తన కష్టపడి ప్లాన్ చేసుకున్న షూటింగ్ షెడ్యూల్ అంతా క్లియర్ చేసేసి, ఒక్క ఈ ప్రాజెక్ట్‌పైనే ఫోకస్ చేయబోతున్నాడు. బాహుబలి తర్వాత ఈ రేంజ్‌లో ఏ సినిమా కోసం ప్రభాస్ ఇలా పూర్తిగా డెడికేట్ అవ్వడం ఇదే మొదటిసారి.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అందుకే దర్శకుడు ఆయనను బాడీ లాంగ్వేజ్‌ నుంచి డైలాగ్ డెలివరీ వరకూ అన్నింటిలోనూ పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అవాల్సిందిగా అడిగాడు. మధ్యలో మరో సినిమా చేస్తూ ఫోకస్ తగ్గిపోతుందని స్పష్టంగా చెప్పాడట. ఆ మాటలను గౌరవిస్తూ ప్రభాస్ కూడా ఇతర సినిమాలు పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నాడు. ఇది డిసెంబర్ 5న విడుదల కానుంది. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్‌లో వస్తున్న ‘ఫౌజీ’ సినిమా మాత్రం కాస్త హోల్డ్‌లో పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు సగం వరకు మాత్రమే పూర్తయిందట. ‘స్పిరిట్’ కారణంగా ఆ సినిమా మరో మూడు, నాలుగు నెలలు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఇవన్నీ అధికారికంగా ప్రకటించకపోయినా, ఇవి నిజమైతే ‘స్పిరిట్’ సినిమా ప్రభాస్ కెరీర్‌లో ఒక కీలక మలుపు అవుతుంది. బాహుబలిలో రాజమౌళికి ఉన్న కంట్రోల్ ఇప్పుడు సందీప్ వంగా చేతుల్లోకి వెళ్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇలా చూస్తే.. రాజమౌళి తర్వాత ప్రభాస్‌ను పూర్తిగా కట్టిపడేసిన డైరెక్టర్ సందీప్ వంగానే అని చెప్పొచ్చు!