Shanmukh Jaswanth : ‘ప్రేమకు నమస్కారం’ అంటున్న షణ్ముఖ్ జస్వంత్.. కొత్త లవ్ స్టోరీ రివీల్

Premakunamaskaram
Shanmukh Jaswanth : యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు హీరోగా వెండితెరపై అడుగుపెడుతున్నాడు. ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శివాజీ, భూమిక ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏబీ సినిమాస్ పతాకంపై అనిల్ కుమార్ రావాడ, భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా మంగళవారం షణ్ముఖ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రానికి ‘ప్రేమకు నమస్కారం’ అనే టైటిల్‌ను ప్రకటించి టైటిల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో యువతకు సంబంధించిన లవ్ ఫెయిల్యూర్స్, బ్రేకప్ సీన్స్, వాటి వెనుక ఉన్న ఫన్నీ ఎమోషన్స్‌ను ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. ఇక ఫైనల్‌గా ఫణ్ముఖ్‌ ఇది పాన్‌ ఇండియా ప్రేమ ప్రాబ్లమ్‌ అని చెప్పడం, మీరు అమ్మాయి దక్కలేదని మందుకు, సిగరెట్లకు ఖర్చు పెట్టే డబ్బులతో కైలాసగరి దగ్గర ల్యాండ్‌తో పాటు కారు కొనుక్కోవచ్చు అని చెప్పే సంభాషణలు నేటి యూత్‌కు, వాళ్ల ప్రేమకు ఎంతో కనెక్ట్‌ అవుతాయి.టోటల్‌గా ‘ప్రేమకు నమస్కారం’ అనే టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఈ సందర్భంగా దర్శకుడు భీమ శంకర్ మాట్లాడుతూ, “ఇదొక యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్. నేటి యువత లవ్, బ్రేకప్ అనుభవాలకు బాగా కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి” అని పేర్కొన్నారు. నిర్మాతలు కూడా ఈ చిత్రంలోని కొత్తదనం, హిలేరియస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రత్యేకతలని చెబుతూ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రంలో బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అరుణ్ అదిత్, రంగస్థలం మహేష్, మణిచందన, కమల్, క్రాంతి, నీల రమణ, శోభన్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం గ్యానీ, సినిమాటోగ్రఫీ కిషోర్ బోయిడపు, లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి & దినేష్ కాకెర్ల, ఎడిటింగ్ హరి, ఆర్ట్ రవికుమార్, కొరియోగ్రఫీ శ్రావణ్ – విశాల్ అందిస్తున్నారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల