
Chai Wala : యంగ్ & ప్రామిసింగ్ హీరో శివ కందుకూరి హీరోగా, హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు నిర్మిస్తున్న చిత్రం ‘చాయ్ వాలా’. ఈ సినిమాకు ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌లతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి తాజాగా తొలి పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘సఖిరే..’ అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ హృదయాలను హత్తుకుంటోంది. క్యాచీ ట్యూన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్. విహారి మంత్ర ముగ్ధులను చేయగా, సురేష్ బనిశెట్టి రాసిన ఈ పాటను కపిల్ కపిలన్ తన మధుర స్వరంతో మరింత అందంగా మార్చాడు. ప్రేమలో పడ్డ హీరో తన ప్రేయసి పట్ల స్వచ్ఛమైన భావాలను అద్భుతంగా వ్యక్తం చేసిన ఈ పాట యూత్ & మ్యూజిక్ లవర్స్‌కి బాగా కనెక్ట్ అవుతోంది. హీరో శివ కందుకూరి స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకోగా, హీరోయిన్ తేజు అశ్విని తన అందంతో చూపులను కట్టిపడేస్తోంది. ఇద్దరి రొమాంటిక్ మూమెంట్స్ విజువల్ ట్రీట్‌లా అనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ అందించగా, ఎడిటర్‌గా పవన్ నర్వ పనిచేస్తున్నారు.










