Shruti Haasan: గ్లామర్ ప్రపంచంలో ఉంటూ ఇలాంటి పనా? శృతి హాసన్ ఆన్సర్‌కు షాక్ అయిన అభిమాని!

Shruti Haasan

Shruti Haasan: తన విలక్షణమైన ఫ్యాషన్, ముక్కుసూటితనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శృతి హాసన్.. తాజాగా ఈ బ్యూటీ తన హెయిర్ కేర్ గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. గ్లామర్ ప్రపంచంలో ఉండే సెలబ్రిటీలు నిత్యం బ్యూటీషియన్లు, హెయిర్ స్టైలిస్టులతో బిజీగా ఉంటారు. కానీ, ‘సలార్’ బ్యూటీ శృతి హాసన్ మాత్రం గత ఐదేళ్లుగా కనీసం హెయిర్ సెలూన్‌ మెట్లు కూడా ఎక్కలేదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో శృతి హాసన్‌కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. “మీ పొడవైన, నల్లని జుట్టు సౌందర్య రహస్యం ఏంటి? సెలూన్‌కు ఎంత తరచుగా వెళ్తారు?” అని ఒక నెటిజన్ అడిగాడు.

Also Read :  Priyanka Chopra: గ్లోబల్ స్థాయిలో 'వారణాసి'.. ఇది ఎవరూ ఊహించని భారీ ప్రాజెక్ట్ అంటున్న ప్రియాంక చోప్రా!

దీనికి శృతి ఏమాత్రం దాచుకోకుండా నిజాయితీగా సమాధానమిస్తూ.. “నేను సెలూన్‌కు వెళ్లి దాదాపు ఐదేళ్లయింది. చివరిసారిగా 2017లో నా జుట్టుకు రంగు వేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి హెయిర్ కలర్స్ ఉపయోగించలేదు. నా జుట్టును నేనే కత్తిరించుకుంటాను. దానికి కావాల్సిన ట్రీట్‌మెంట్ కూడా ఇంట్లోనే స్వయంగా చేసుకుంటాను” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం శృతి హాసన్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెయిర్ ట్రీట్‌మెంట్లు, ఖరీదైన సెలూన్లకు దూరంగా ఉంటూ.. ఏడేళ్లుగా హెయిర్ డై కూడా వాడకుండా ఆమె తన జట్టును కాపాడుకోవడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read :  Nag Ashwin: ‘విశ్వంభర’ కోసం రంగంలోకి ‘కల్కి’ డైరెక్టర్.. అందుకేనా?

శృతి హాసన్ కేవలం జుట్టు విషయమే కాదు.. ఫ్యాషన్, సంగీతం, ఫిట్‌నెస్ ఇలా ప్రతి దాంట్లోనూ ఇతరుల కంటే భిన్నంగా తనకు నచ్చిందే చేస్తుంటారు. మానసిక ఆరోగ్యం, స్వీయ సంరక్షణపై ఆమెకు ఉన్న బలమైన ఫిలాసఫీయే ఇందుకు కారణం అని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సెలబ్రిటీల బ్యూటీ రొటీన్లు అంటే వేలల్లో, లక్షల్లో ఖర్చుతో కూడుకున్నవని, సామాన్యులకు అవి సాధ్యం కాదనే అభిప్రాయం జనాల్లో ఉంది. కానీ మంచి జుట్టు కోసం ఖరీదైన ప్రొడక్ట్స్, నిపుణుల బృందం అవసరం లేదని, ఇంట్లోనే క్రమశిక్షణతో కూడిన సంరక్షణ ఉంటే చాలని శృతి నిరూపించారు.