Telusu Kada Trailer : ‘తెలుసు కదా’ ట్రైలర్.. పవర్ సెంటర్ ఎప్పుడూ ఇక్కడే ఉండాలి!

Telusukada
Telusu Kada Trailer : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’ ఇప్పటికే టీజర్‌, పాటలతోనే బలమైన బజ్ సృష్టించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read :  తెలంగాణ మట్టివాసనతో మరో కథ.. కాస్టింగ్ కాల్ ప్రకటించిన "రాజు వెడ్స్ రాంబాయి" మేకర్స్

ట్రైలర్‌లో సిద్ధు, మగవారి చేతిలోనే పవర్, కంట్రోల్ ఉండాలి అని నమ్మే వ్యక్తిగా కనిపించారు. ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్షిప్ లో చిక్కుకుపోయిన అతని జీవితం, ఆ తర్వాత ఎమోషనల్ రైడ్ ని అందిస్తోంది. ఈ కథలో మూడు ప్రధాన పాత్రలు ఉన్నా, ట్రైలర్ చూస్తే ఇది పూర్తిగా సిద్ధు జొన్నలగడ్డ వన్ మాన్ షో అని చెప్పొచ్చు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ, డైలాగ్ డెలివరీ అదిరిపోయాయి. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నాలతో సిద్ధు కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. వైవా హర్షా తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, డిఫరెంట్ ఫ్రెండ్‌ పాత్రలో మెప్పించారు. మొత్తం మీద ‘తెలుసు కదా’ ప్రేమ, చార్మ్, లేయర్డ్ ఎమోషన్‌ల మేళవింపుగా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకునే రొమాంటిక్ డ్రామాగా థియేటర్లలో రాబోతోంది.

Also Read :  Buchi Babu: 'పెద్ది' హీరోయిన్ పాత్రపై ట్రోల్స్.. దర్శకుడు బుచ్చిబాబు ఎమోషనల్ కామెంట్స్!