Telusu Kada : నయనతార లాంచ్ చేసిన సిద్ధూ రొమాంటిక్ ట్రాక్ ‘సొగసు చూడతరమా’..

Telusukada
Telusu Kada : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ మల్లికా గంధ చార్ట్‌బస్టర్‌గా నిలవగా, రెండో సింగిల్ సొగసు చూడతరమా ను హీరోయిన్ నయనతార లాంచ్ చేశారు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి అందించిన గ్లామర్ సినిమాకు మరింత ఆకర్షణగా మారుతోంది.

ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ పాటకు కార్తీక్ వోకల్స్, కృష్ణకాంత్ లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెట్రో టచ్‌తో కూడిన థమన్ బాస్‌లైన్, డ్రమ్ బీట్స్, ట్రంపెట్ వర్క్ పాటను చార్ట్‌బస్టర్‌గా నిలిపాయి. సిద్ధు – శ్రీనిధి జంట మధ్య కెమిస్ట్రీ, స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ విజువల్స్‌కి మరింత బ్యూటీ యాడ్ చేశాయి.

Also Read :  Sai Durgha Tej: ‘సేవ్ ద టైగర్స్’ డైరెక్టర్‌తో మెగా హీరో కొత్త సినిమా.. ‘పరువేట’ వెనుక ఉన్న అసలు కథ ఇదే!

సినిమాటోగ్రఫీ జ్ఞానశేఖర్ వి.ఎస్., ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా బాధ్యతలు వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమా పై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. ఈ చిత్రం అక్టోబర్ 17న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read :  Ram Charan Devalayam: గుడి కట్టే రేంజ్‌లో రామ్ చరణ్ క్రేజ్.. కూకట్‌పల్లిలో మెగా అభిమానుల అరాచకం.. ఏం జరిగిందంటే?